ప్రకాశం జిల్లా బేస్తవారిపేట అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం ఎస్సై రవీంద్రారెడ్డి వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న ఓ వాహనదారుడిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. వాహనాన్ని సీజ్ చేశామని మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తిని గిద్దలూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.