ముండ్లమూరు మండలం శంకరాపురంలో అక్రమ మద్యం విక్రయిస్తున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తిని ఎక్సైజ్ శాఖ అధికారులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. అక్రమంగా గొలుసు దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో సిబ్బంది నాగరాజు, కాశిం పీరా, శ్రీనివాసులు పాల్గొన్నారు.