అధిక విస్తీర్ణంలో పొగాకు సాగు చేయడంతో వాటి అమ్మకాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని ముండ్లమూరు మండల వ్యవసాయ శాఖ అధికారి ఎండి ఫరూక్ తెలిపారు. ముండ్లమూరు మండల పరిధిలోని పొగాకు రైతులతో ఫరూక్ సోమవారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకు సాగువలన భూమిలో పోషకాలు తగ్గిపోతాయని తెలిపారు. తక్కువ పెట్టుబడితో మొక్కజొన్న, పెసర, సెనగ వంటి పంటలు వేసుకోవాలని సూచించారు.