అద్దంకి: కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియామకం
అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా అడుసుమల్లి కిషోర్ బాబును నియమిస్తూ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె ఉత్తర్వులలో పేర్కొన్నారు. నిత్యం ప్రజల సమస్యలపై పోరాటం చేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కిషోర్ బాబు వైయస్ షర్మిల కు కృతజ్ఞతలు తెలిపారు.