అద్దంకి డిపో నుంచి బ్రహ్మంగారి మఠమునకు శనివారం నుండి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో నూతన ఎక్స్ ప్రెస్ సర్వీస్ ప్రారంభించబడుతుందని డిపో మేనేజర్ రామ్మోహన్ రావు శుక్రవారం తెలిపారు. ఉదయం ఐదున్నర గంటలకు బస్సు అద్దంకి డిపో నుంచి బయలుదేరుతుందని ఆయన చెప్పారు. ఈ సర్వీస్ ముండ్లమూరు, దర్శి, పొదిలి, బెస్తవారిపేట పోరుమామిళ్ల మీదగా వెళుతుందని తెలియజేశారు.