ఒంగోలులో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం పరిశీలించారు. వివిధ ప్రాంతాలలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇంజనీరింగ్ సిబ్బంది కమిషనర్ తో కలిసి ఆ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఓల్డ్ బైపాస్ రోడ్డు, భాగ్యనగర్ 4వ లైన్ లో నిర్మిస్తున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.