చెరువులో పడి వృద్ధురాలు మృతి
ప్రకాశం జిల్లా టంగుటూరులో విషాదం నెలకొంది. మతిస్థిమితం లేని వృద్దురాలు టంగుటూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం జరిగింది. విషయాన్ని తెలుసుకున్న టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు వృద్ధురాలి మృతదేహాన్ని వెలికి తీశారు. వృద్ధురాలు టంగుటూరుకు చెందిన అచ్చమ్మగా గుర్తించారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.