కొండేపి జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ మనోజ్ కుమార్ ఒంగోలు టిడిపి నాయకుడు శశికాంత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా ఖండించారు. ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మనోజ్ కుమార్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నాయకులు అన్న తమ్ముడిలా కలిసి పనిచేస్తుంటే నీలాంటి వైసీపీ కోవర్టులు చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.