ఉరివేసుకొని బాలుడు ఆత్మహత్య
మానసిక స్థితి సరిగాలేని ఓ బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కనిగిరి మండలం మాచవరం గ్రామంలో బుధవారం చోటు చేసుకున్నది. గత కొన్ని రోజులుగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బందులు పడుతున్న మధుసూదన్ మాచవరం గ్రామంలో అమ్మమ్మ గారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.