ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం అక్కపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని ఆదివారం ఎస్ఐ రవీంద్రారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వద్ద నుండి 27 క్వాటర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎవరు కూడా మండలంలో మద్యం బెల్టు షాపులు నిర్వహించవద్దని హెచ్చరించారు.