దక్షిణ నియోజకవర్గం సిపిఎం ఏడవ మహాసభలు ఈనెల 19వ తేదీన నిర్వహిస్తున్నట్లుగా సిపిఎం పార్టీ నియోజకవర్గ కార్యదర్శి రంగారావు శనివారం తెలిపారు. అందులో భాగంగా సుందరయ్య భవన్ లో పార్టీ నేతలు వెంకటేశ్వరరావు, నారాయణ, పిచ్చయ్య, ఆదినారాయణతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి లోని ఆర్థిక స్థితిగతులు, అభివృద్ధి ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులపై మహాసభలలో చర్చిస్తామన్నారు.