స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎస్ కోట ఎంపీడీవో సతీష్ సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రదర్శించారు. ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు తెలిపారు. కాగా పట్టణంలో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసామని, రాజకీయ నాయకులకు సంబంధించిన హోర్డింగ్లు తొలగించామని, రాజకీయ ప్రకటనలపై కాగితాలు అంటించినట్లు పంచాయతీ ఈవో అనురాధ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కోడ్ ను పాటించాలని తెలిపారు.