ప్రాణాలు సైతం పనంగా పెట్టి విధులు నిర్వహించే శాఖల్లో విద్యుత్ శాఖ ఒకటని ఆదివారం జరిగిన ఈ సంఘటనతో నిరుపతమైంది. ఎస్ కోట మండలం దొగ్గపేట సమీపంలో 11 కె. వి వైర్లు ఆదివారం ఉదయం తెగిపడ్డాయి. సమాచారం అందుకున్న ఏ ఎల్ ఎం కోటరావు హుటాహుటిన ఘటనా స్థలానికి తన సిబ్బందితో చేరుకుని చెరువులో ఈదుకుంటూ విద్యుత్ స్తంభం వద్దకు చేరుకొని మరమ్మతులు చేపట్టారు. సకాలంలో సిబ్బంది మరమ్మతులు చేపట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.