సాలూరు: వారం రోజులుగా కదలని చెత్త
సాలూరు పట్టణంలోని 12వ వార్డు గాడి వీధి రామ మందిరం వద్ద గత వారం రోజులుగా చెత్త పేరుకుపోయింది. ఇంటింటికి చెత్త సేకరిస్తున్నప్పటికీ రోడ్డుపై ఉన్న చెత్త తొలగించడం లేదు. దీంతో రామ మందిరానికి వచ్చే భక్తులు, ఆ రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రజలు ముక్కు మూసుకుని నడవాల్సిన దుస్థితి ఏర్పాడింది. చెత్తను తొలగించి సమస్య పరిష్కరించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.