ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన పి. కోనవలస చెక్ పోస్ట్ వద్ద ఒరిస్సా రాష్ట్రం లావుడి గ్రామానికి చెందిన ఐదుగురు మహిళల వద్ద 750 ప్యాకెట్ల (75లీటర్ల) నాటు సారాను పాచిపెంట ఎస్ఐ వి. సురేష్ స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా తరలిస్తున్న మహిళలను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఎస్ఐ సురేష్ గురువారం తెలిపారు.