గ్రామ స్థాయిలో టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పిలుపునిచ్చారు. జియమ్మవలసలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. సీఎం నారా చంద్రబాబు అమలు చేస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.