గంట్యాడ మండలం వసాది, మోకాలపాడు తదితర గ్రామాల్లో బుధవారం గంట్యాడ మండల టిడిపి అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మండలానికి చెందిన పలు శాఖల అధికారులతో గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.