విజయనగరం జిల్లా గజపతినగరంలోని మాజీ మంత్రి పడాల అరుణను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. ఇటీవల అరుణ కుమారుడు శరత్ చంద్ర మృతి చెందడంతో మంత్రి శ్రీనివాస్ ఆదివారం పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సమయంలో గుండె ధైర్యంతో ముందుకు సాగాలని అరుణకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గోపాలరాజు, మక్కువ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.