ఆయుష్ వైద్య విధానం గురించి ప్రజలకు వివరించాలని గొట్లాం ఆయుర్వేదిక్ వైద్యాధికారి డాక్టర్ బి సునీత అన్నారు. శుక్రవారం బొండపల్లి మండలంలోని దేవుపల్లి పీ. హెచ్. సిలో ఆశా కార్యకర్తలకు అవగాహన సదస్సు జరిగింది. ప్రాచీన ఆరోగ్య వైద్య విధానం, ఆయుష్ వైద్య విధానంపై వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ షర్మిల, హెల్త్ విజిటర్ రమణమ్మ, కాంపౌండర్ రమణ పాల్గొన్నారు.