ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుబడులను ఆహ్వానించేందుకు 10 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లా విచ్చేసిన మంత్రి శనివారం సాయంత్రం కొండపల్లి శ్రీనివాస్‌కు ఘన స్వాగతం లభించింది. విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద గంట్యాడ మండల టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరరావు, పార్టీ నాయకులు మంత్రికి స్వాగతం పలికి సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.