జనావాసాల మధ్య వైన్‌షాపులు తొలగించాలని బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీ కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడుతూ జనావాసాల మద్యం దుకాణాలతో మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు తక్షణమే స్పందించి దుకాణాలను వేరే చోటకి మార్పు చేయాలని పేర్కొన్నారు.