ఎమ్మెల్సీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలిపించాలని బొబ్బిలి మాజీ శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఎమ్మెల్సీ ఓటర్లను కోరారు. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో సోమవారం సాయంత్రం బొబ్బిలి పట్టణంలో గల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బొబ్బిలి నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.