ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి సచివాలయ సిబ్బందిలో ఒకరు రూ. 1. 76 లక్షలు పింఛను డబ్బు తీసుకుని ఉడాయించాడు. ఈనెల ఒకటో తేదీన గ్రామంలో కొంతమంది లబ్దిదారులకు పింఛను పంపిణీ చేసిన ఉద్యోగి ఇంకా 39 మందికి రూ. 1. 76 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఫోన్ స్విచాఫ్ చేసి డబ్బులు తీసుకుని పరారయ్యాడు. పంచాయతీ కార్యదర్శి రావులపల్లి శ్రీనివాసరావు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.