రైతుల ప్రయోజనాలు కాపాడాలి
రైతుల ప్రయోజనాలను కాపాడాలని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ వ్యవసాయ శాఖ సిబ్బందిని కోరారు. గురువారం ఆయన కార్యాలయంలో వ్యవసాయ అధికారులు సిబ్బందితో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ రైతులెవరూ బాధపడకూడదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేస్తూ ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులకు అందించాలని సూచించారు. నిష్పక్షపాతంగా పని చేస్తూ రైతులకు సేవలు అందించాలని కోరారు.