గుంటూరు: ఎట్టకేలకు స్పందించిన రామ్ గోపాల్ వర్మ
గుంటూరు జిల్లాతో పాటు పలు చోట్ల సినీ దర్శకుడు ఆర్ జి వి పై పలు కేసులు నమోదు కాగా వారు పరార్ అయ్యారంటూ వచ్చిన వార్తలపై మంగళవారం స్పందించారు. నేను ఏడవడం లేదు, భయపడటం లేదని, తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అన్నారు. నేను ట్వీట్స్ పెట్టినవారికి కాకుండా.. ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. సినిమా షూటింగ్స్ వలన కోర్ట్ కు హాజరు కాలేదని పేర్కొన్నారు.