గుంటూరు: రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పని చేయాలి

61பார்த்தது
భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మంగళవారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కె. ఎస్ లక్ష్మణరావు, జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, ఇతర దళిత, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி