తెలంగాణలో సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సంబంధించిన ఏప్రిల్1-అక్టోబర్ 24 (2023-24) మధ్య దీపావళి బోనస్ రూ.18.27కోట్లు ఇవాళ (బుధవారం) ఖాతాల్లో జమ చేస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ తెలిపారు. దాదాపు 2,754 మంది కార్మికులకు బోనస్ కింద ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.93,750 చొప్పున మొత్తంగా రూ.18.27 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. కార్మికుల ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.