అధికార పార్టీలు రాజకీయ పాలన మాని, రాజ్యాంగబద్ధ పాలన చేయడం ద్వారానే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోగలుగుతామని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ 75వ దినోత్సవం సందర్భంగా మంగళవారం గుంటూరు లాడ్జిసెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ పీఠికలో 1975లో పొందుపరిచిన సామ్యవాదం కొనసాగించాలని తెలిపారు.