ఫుడ్ పాయిజన్తో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కుమురంభీం జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.1.20 లక్షలు అందజేసింది. దీంతో పాటు రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని ఎమ్మెల్సీ విఠల్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ హామీతో గ్రామస్థులు నిన్న శైలజ అంత్యక్రియలు పూర్తి చేశారు.