గంపలగూడెం వైసిపి పట్టణ కన్వీనర్ అయిన కొత్తగుండ్ల నరసింహారావు శుక్రవారం రాజీనామా చేశారు. నరసింహ రావు మాట్లాడుతూ..ఆరోగ్యం సహకరించినందున గంపలగూడెం వైఎస్ఆర్సిపి పట్టణ పార్టీ కన్వీనర్ పదవికి రాజీనామా చేయుచున్నాను అని తెలిపారు. పార్టీలో క్రియాశీల కార్యకర్తగానే కొనసాగుతూ.. పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటా అన్నారు. ఈరోజు వరకు సహకరించిన పార్టీ పెద్దలందరికీ, కార్యకర్తలకు ధన్యవాదాలు అని ఓ ప్రకటన తెలిపారు.