మైలవరం మండలం వెల్వడం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో శుక్రవారం నిర్వహించారు. మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోమటి సుధాకర్ రావు సూచనల మేరకు గ్రామంలోని కూటమి నాయకులు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.