నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన డీఆర్సీ సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గళమెత్తారు. వరి, పత్తి, పొగాకు, మిర్చి, రొయ్యలు, చేపల రైతులకు ప్రయోజనం కలిగించేలా అదానీ కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణకు ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కంటైనర్ టెర్మినల్ ను పునరుద్ధరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు.