57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నెల్లూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం స్టోన్ హౌస్ పేట, నెల్లూరు నందు పుస్తక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి షాలేమ్ రాజు, యన్ఐసి జిల్లా మేనేజర్ సురేష్ కుమార్ ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజా, సీనియర్ ఉపాధ్యాయులు చల్లా చంద్రశేఖర్ రెడ్డి, పుస్తక ప్రియులు, విద్యార్థులు పాల్గొన్నారు.