కావలి: కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా రోధించిన తల్లి
కావలి పాతూరులోని అక్కం బావిలో మంగళవారం లభ్యంమైన విషయం తెలిసిందే. మృతుడు వెంకయ్య గారి పాలెంకు చెందిన కూర శ్రీకాంత్ గా గుర్తించారు. అక్కడికి చేరుకుని మృతుడి తల్లి గుండెలు పగిలేలా రోధించింది. ఆమె ఆవేదన చూసి చుట్టుపక్కల వారు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం.