అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో రెవెన్యూ, పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్న గౌడ్ అన్నారు. సోమవారం నందవరంలో బస్టాండ్ దగ్గర అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగలదిన్నె గ్రామం నుండి ఎలాంటి అనుమతులు లేకపోయినా అధికార పార్టీ నాయకులు అండదండలతో రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో రోజుకు ట్రాక్టర్ల ద్వారా 100 ట్రిప్పుల అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్నారు.