గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నందవరం మండలం ముగతి గ్రామంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రహదారులను బాగు చేసుకుంటేనే గ్రామాలు, పట్టణాలకు రాకపోకలు పెరిగి అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు.