11న లాటరీ ద్వారా మద్యం షాపులను ప్రభుత్వం కేటాయిస్తుందని ఎమ్మిగనూరు ఎక్సైజ్ శాఖ సీఐ రమేష్ రెడ్డి సోమవారం స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి లాబీయింగ్ కు తావు లేకుండా మద్యం షాపుల ధరఖాస్తు స్వీకరణ కార్యక్రమం జరిగిందని అధికారులు తెలిపారు. రూ. 99కే మద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నెల 12న విజయదశమి నుంచి మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.