రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న దళితుల మధ్య వర్గీకరణ చిచ్చు పెట్టి మాలలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని, ప్రతి ఒక్కరు పోరాటాలకు సిద్ధం కావాలని మాల మహానాడు జేఏసీ జిల్లా అధ్యక్షులు సాంబశివుడు, రాజగోపాల్ అన్నారు. ఎస్సీలు ఏకమై ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి మాలలంటే మనువాదుల్లా కాదు సింహళ్లా గర్జించాలన్నారు. సోమవారం కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు.