చక్రాయపేట: గుర్తు తెలియని వృద్ధురాలు మృతి
గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందిన ఘటన గండిలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ఏడు గంటలకు పంచముఖ ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. గమనించిన పోలీసు సిబ్బంది అంబులెన్స్ ద్వారా వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని మంగళవారం ఆర్కే వ్యాలీ ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. మృతురాలికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని ఎస్సై తెలిపారు.