వేంపల్లె: వృద్ధులకు అన్నదానం
వేంపల్లె: అనాథ వృద్ధులకు అన్నదానం చేయడం తనకు ఆనందాన్ని కలిగిస్తోందని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు బండపల్లి శివకేశవరెడ్డి రెడ్డి అన్నారు. తండ్రి బండపల్లె పుల్లారెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా.. గురువారం మదర్ థెరీసా అనాధ వృద్ధాశ్రమంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానంతో పాటు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.