పత్తికొండ: కూలిన వంతెన.. గిరిగిట్ల, అమీనాబాద్ రాకపోకలు బంద్
తుగ్గలి మండలంలోని గిరిగిట్ల- అమీనాబాద్ వంతెన శుక్రవారం కూలిపోయింది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లింగాలవాగుపైన నిర్మించిన వంతెన మీదుగానే అమీనాబాద్, పగిడిరాయి, చెన్నంపల్లి, రామలింగాయపల్లె తదితర గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రి వేళ వంతెన కూలడంతో ఎటు వెళ్లాలో అర్థం గాక ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.