పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమాడ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. గురువారం జలజీవన్ మిషన్ నిధులు రూ. 60. 5 లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివా రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. లిఫ్ట్ తీసుకొచ్చి పుచ్చకాయలమాడతో పాటు పక్కనున్న గ్రామాల పొలాలకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్లివ్వాలని సీఎం సంకల్పించారన్నారు.