కాలినడకన హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల బృందాన్ని ఓ శునకం అనుసరిస్తోంది. వరుసగా రెండో ఏడాది ఆ స్వాములతో కలిసి కిలోమీటర్లకు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ కనిపించింది. శనివారం వెల్దుర్తి పట్టణం మీదుగా శబరిమలై వెళ్తున్న అయ్యప్పస్వాములతో కలిసి ఆ శునకం ప్రయాణం సాగిస్తూ కనిపించింది. గత ఏడాది కూడా ఆ శునకం తమతో పాటు శబరిమలై వరకు మహాపాదయాత్ర చేసిందన్నారు. యాత్రలో తమకు ఇది వినూత్న అనుభవమన్నారు.