పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో కార్తీక మాసం కావడంతో ప్రజలకు ఎస్సై అశోక్ జాగ్రత్తలు తెలిపారు. శనివారం ఆయన వెల్దుర్తిలో మాట్లాడారు. మండలంలోని బ్రహ్మగుండంలో కార్తీక పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు, పిల్లలు, వృద్ధులు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కోనేరు స్నానం ఆచరించేటప్పుడు పోలీసుల సూచనలకు అనుగుణంగా అనుసరించాలన్నారు. భక్తులు ఒంటరిగా కాలువలు, నదుల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు.