మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా మాధవరం ఎన్. రాఘవేంద్రరెడ్డిని నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని నెలలుగా ఇన్చార్జ్ ఎంపికపై ఎన్నో చర్చలు జరిగాయి. తిక్కారెడ్డి వర్గం ఆశలు పెట్టుకున్నప్పటికీ చివరికి రాఘవేంద్రరెడ్డికే ఇన్చార్జ్ పదవి దక్కింది. ఈ నిర్ణయంతో తిక్కారెడ్డి వర్గం నిరాశ చెందగా, రాఘవేంద్రరెడ్డి వర్గం హర్షం వ్యక్తం చేసింది.