ఆదోని డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లోని మండల తహసీల్దార్ కార్యాలయాలలో తహసీల్దార్ల ఆధ్వర్యంలో సోమవారం మీ కోసం (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నవ్య ఆయా శాఖలపై వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.