రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నైపుణ్య గణన సర్వేను సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని కోడుమూరు ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ నిర్వహించి ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికి వెళ్లి 15 నుంచి 59 సంవత్సరాల్లోపు వారి విద్యార్హతలు, వారికి ఏ రంగంపై మక్కువ ఉందో వివరాలను యాప్ లో నమోదు చేయాలన్నారు.