కోడుమూరు మండలంలోని కల్లపరిలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం గ్రామానికి చెందిన జగన్ (41) పదేళ్ల నుంచి వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నాడు. పంటలు కలిసి రాక ఐదేళ్ల క్రితం ఎకరా పొలం అప్పు కింద రాసిచ్చాడు. దీనికితోడు ప్రమాదంలో కాలు విరిగి బాగా ఖర్చు అయ్యింది. అయినా కుంగిపోకుండా అప్పులు తీర్చే మార్గం లేక ఇంట్లో కొక్కెంకు పంచెతో ఉరివేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు.