ప్యాపిలి మండలం పెద్ద పాయ గ్రామపంచాయతీ పరిధిలోని వెంకట కొండాపురం గ్రామం గత రెండు నెలల నుండి పారిశుద్ధ్య పనులు చేయడం లేదు. ఈ పంచాయతీ చండ్రపల్లి సచివాలయ పరిధిలోనికి వచ్చును. ఈ విషయం గురించి గ్రామపంచాయతీ కార్యదర్శి చంద్రిక గారికి ఎన్నిసార్లు విషయం తెలియజేసిన ఆమె స్పందించడం లేదు. సైడ్ కాలువలు క్లీన్ చేయకపోవడం వలన దోమల బారిన పడి పిల్లలకు అనారోగ్యాలు గురి కావడం జరుగుతుంది అని గురువారం ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.