ఆళ్లగడ్డ: ఎగువ అహోబిలంలో ప్రాయశ్చిత్త హోమం
ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు మహా పూర్ణాహుతితో ఘనంగా బుధవారం ముగిశాయి. శ్రీవారి నిత్య నైమిత్తిక పూజా విధానాలలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు ప్రతియేటా ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వేద పండితులు శ్రీ జ్వాలానరసింహస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.